గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?
ఆంధ్రప్రదేశ్లోని గోదావరి పుష్కరాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈసారి రాబోతున్న గోదావరి పుష్కరాలు 2027 జులై 23 నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహించబోతున్నారు. ఇక ఈ పుష్కరాలకు భారీ ఎత్తున భక్తులు తరలివస్తారు కాబట్టి ఈసారి జరగబోయే పుష్కరాలకు సుమారు 8 కోట్ల మంది వరకు వచ్చే అవకాశం ఉందని అంచనా. ఈ మేరకు సమావేశమైన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పుష్కరాలకు సంబంధించిన పనులు చేపట్టడం కోసం రూ.904 కోట్లతో ప్రతిపాదనను సిద్ధం చేస్తోంది.
పుష్కరాలు జరగడానికి వ్యవధి ఎక్కువగా ఉండడంతో మూడు విడతలలో పనులు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. గోదావరి బండ్ రోడ్డును విస్తరించడంతోపాటు అదనంగా 17 ఘట్లను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. 800 ఎకరాల స్థలాన్ని 74 పార్కింగ్ ప్రాంతాలుగా ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు పార్కింగ్ ప్రాంతాల ఏర్పాటుకు స్థలాలను సేకరించడానికి పూనుకున్నారు. ఇక గోదావరి పుష్కరాలలో కేంద్ర భాగస్వామ్యం పై కూడా త్వరలోనే చర్చించబోతున్నామని ఎంపీ పురంధరేశ్వరి చెప్పారు. అఖండమైన గోదావరి పొడవునా.. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే దానికి విధంగా మఠాధిపతులు ప్రచారం చేయించాలి అని కూడా పేర్కొన్నారు.
కుంభమేళ.. రామ ప్రతిష్ట.. తరహాలో ఈ గోదావరి పుష్కరాలను కూడా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. పుష్కర ఘాట్ల వద్ద ప్రజలకు అవసరమైన సదుపాయాలతో పాటు ఉచిత మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి దుర్గేష్ గోదావరి పుష్కరాలకు జిల్లాను యూనిట్ గా భావించి శాశ్వత ప్రతిపాదికతో పనులు జరిగే విధంగా చూస్తామని తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు వసతి దగ్గర నుంచి భోజనాల వరకు అన్ని వసతులు సమకూరే విధంగా జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొంటున్నారు. ఇక పుష్కరాలు అంటే రద్దీ, ట్రాఫిక్ మామూలుగా ఉండదు.. అందుకే ట్రాఫిక్ నియంత్రణ అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయబోతున్నామని పేర్కొన్నారు.













