Game Changer : గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి
రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ (Game changer) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో జరిగే ఈ ఈవెంట్‌కు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ (Kandula Durgesh) పరిశీలించి కలెక్టర్ శ్రాంతి, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్‌తో మాట్లాడారు. అభిమానుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని దానికి అనుగుణంగా పోలీసు(Police) బందోబస్తు ఏర్పాట్లు పటిష్టం చేయాలని, వీఐపీ భద్రత, ట్రాఫిక్ రద్దీ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. బాబాయ్-అబ్బాయ్ ఒకే స్టేజ్ పై సందడి చేయనున్నారని, ఇది అభిమానులకు కన్నులపండుగ కానుందని ఆయన తెలిపారు.













