అదే విధానాన్ని ఏపీలో కూడా అమలు
తెలంగాణ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి జవహర్ తీవ్ర ఆరోపణలు చేశారు. గత ఎన్నికల్లో 24 లక్షల ఓట్లు తొలగించి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. అదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయాలని జగన్ యత్నం చేస్తున్నారని విమర్శించారు. దీని కోసం రహస్య ప్రదేశంలో జగన్- కేటీఆర్ కలుసుకున్నది వాస్తవం కాదా? అని అడిగారు. జగన్- కేటీఆర్ భేటీకి బీజేపీ నేత కన్నా మధ్యవర్తిత్వం వహించారని ఆరోపించారు. సూట్ కేసులు మారాయన్నారు. ఎవరెంతో తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ డైరెక్షన్లో, కేటీఆర్ నిర్వహణలో జగన్ గ్రామా ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శత్రు రాష్ట్రంగా తెలంగాణ ఉండటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.













