వాటికి జవాబు చెప్పాల్సిన అవసరం మాకు లేదు : మంత్రి అమర్నాథ్
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకమని రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఉక్కు రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అని వ్యాఖ్యానించారు. లాభనష్టాలు చూడకుండా స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రమే నడపాలన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ నుంచి ఇప్పటి వరకు అధికారి ప్రకటన ఏదీ రాలేదు. సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వ ప్రకటన లేకుండా ఏం మాట్లాడగలం? అని అన్నారు. కొందరు రాజకీయ విమర్శలు చేసే వాళ్లు ఏవేవో మాట్లాడుతారు. వాటికి జవాబు చెప్పాల్సిన అవసరం మాకు లేదు అని అన్నారు.













