మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు.. వచ్చే విద్యాసంవత్సరం నుంచే
మూడు రాజధానుల అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుంచే విశాఖ నుంచి పాలన ఉంటుందని తెలిపారు. బీచ్ ఐటీ కాన్సెప్ట్‌తో విశాఖను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖలో ఇన్వెస్ట్మెంట్ మీట్ ఉంటుందన్నారు. విశాఖలో భూ ఆక్రమణల ఆరోపణలు టీడీపీ నిరూపించాలని సవాల్ విసిరారు. విశాఖలో రాజధానికి సెంటు ప్రైవేటు భూమి కూడా తీసుకోలేదన్నారు. అమరావతిలో, విశాఖలో జరిగిన భూ క్రయవిక్రయాలు ఒక్కటేనా? అని ప్రశ్నించారు. రైతుల పాదయాత్ర సందర్భంగా విశాఖలో ఏం జరిగినా చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు.













