ఏపీకి కేంద్రం ఏమైనా ప్రత్యేకంగా ఇచ్చిందా? : మంత్రి అమర్నాథ్
కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. స్టీట్ప్లాంట్పై అమిత్ షా మాట్లాడకుండా వెళ్లిపోయారని అన్నారు. కేవలం విమర్శలు చేసేందుకే అమిత్ షా వచ్చినట్టు ఉంది అని విమర్శలు చేశారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ కేంద్రంతో ఉండాల్సిన సంబంధాల మేరకే వ్యవహరిస్తున్నాం. వైఎస్ఆర్సీపీకి ఏ పార్టీతోనూ పొత్తులేదు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఏమైనా ప్రత్యేకంగా ఇచ్చిందా? ఇంతవరకు విభజన హామీలను నెరవేర్చలేదు. డీబీటీ ద్వారా నేరుగా నగదు ఇస్తున్న ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? బీజేపీ హయాంలో ఇసుక అక్రమాలపై ఎందుకు మాట్లాడలేదు. రాష్ట్రంలో బీజేపీ టీజేపీగా మారిపోయింది. రాళ్లు వేసిన అమిత్ షాపై ఇప్పుడు టీడీపీ నాయకులు పువ్వులు వేస్తున్నారు.
కనీసం ఒక్క సీటు లేని బీజేపీ 20 సీట్లు ఎలా ఆశిస్తుంది. ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ ఒంటరిగానే పోటీ చేసిది. ఇప్పుడు కూడా అలాగే చేస్తుందన్నారు. అందరూ ఏకమైనా ప్రజా బలం మాత్రం ముఖ్యమంత్రి జగన్ వైపే ఉంది. ఎన్నికలు వస్తున్నాయని బీజేపీ ఇలా విమర్శలు చేస్తోంది. ప్రభుత్వాన్ని విమర్శించక పోతే జనం పట్టించుకోరని అమిత్ షా ఏపీ ప్రభుత్వం విమర్శలు చేసినట్లు కనిపిస్తోంది. టీడీపీ అవినీతికి బీజేపీ సమాధానం చెప్పదా? అమిత్ షా మీటింగ్ వేదికపై ఉన్నది ఎవరు? సీఎం రమేష్, పురందేశ్వరి, సుజనా చౌదరి వీరంతా బీజేపీ నాయకులా? అని ప్రశ్నించారు.













