ఆ నివేదిక వచ్చే వరకూ… ఆనందయ్య మందుపై

కరోనా వైరస్ నివారణలో భాగంగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య తయారు చేసిన ఔషధంపై ఆయుష్ ఇంకా తుది నివేదిక ఇవ్వలేదని ఆంధప్రదేశ్ రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయుష్ నివేదిక వచ్చే వరకూ ప్రభుత్వం మందుపై నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఆయుష్ నుంచి నివేదిక వచ్చిన తర్వాత కొవిడ్ పరిస్థితులకు ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.