కరోనా తర్వాత రాష్ట్రంలో అమెరికా పెట్టుబడులు
కొవిడ్ అనంతరం అమెరికా కంపెనీలు ఆంధప్రదేశ్ వైపు చూస్తాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు. కరోనా అనంతరం ప్రపంచ పెట్టుబడుల గమ్యంగా భారత్ మారనుందన్నారు. మార్కెట్ విస్తరణకు, వృద్ధిరేటు పెరిగేందుకు అవకాశం ఉన్నది భారత్లోనేనన్నారు. ఆంధప్రదేశ్‌కు వచ్చే పెట్టుబడిదారులకు వివాదాల్లేని భూమి, నీరు, విద్యుత్ అందిస్తామన్నారు. గురువారం భారత్-అమెరికా వ్యాపార మండలి ఆంధప్రదేశ్ ప్రతినిధుల వెబినార్‌లో ఆయనతో పాటు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఐటీ కార్యదర్శి భాను ప్రకాశ్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రమణ్యం పాల్గొన్నారు.













