కాకినాడలో కూడా నంద్యాల సీనే
నంద్యాల ఫలితాలే కాకినాడలో కూడా రిపీట్ అవుతాయని మంత్రి గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. విజయనగరంలో నంద్యాల గెలుపు సందర్భంగా జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాల ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారని అన్నారు. జగన్ చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను చూసి ప్రజలు భయపడ్డారని అన్నారు. జగన్ 14 రోజులు నంద్యాల నియోజకవర్గంలో ప్రచారం చేసి, ప్రజలను మభ్య పెట్టాలని చూశారని దుయ్యబట్టారు. అయితే జగన్ మాటాలను అక్కడి ప్రజలు విశ్వసించలేదన్నారు. 2019లో వైసీపీ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతుందని ఎద్దేవా చేశారు. జగన్ మానసిక పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకున్నారని, అందుకే నంద్యాలలో భారీ మెజార్టీని ఇచ్చారని చెప్పారు.













