తాను టీడీపీలోనే ఉంటా
తాను తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని, బయటకు వెళ్లే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సృష్టం చేశారు. విశాఖపట్నంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పార్టీ వల్ల రాజకీయంగాను తాను ఎంతో ఎదిగాన్నారు. ముఖ్యమంత్రి తనపై ఎంతో అభిమానం చూపుతున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో తాను నూరుశాతం భీమిలి నుంచే పోటీ చేస్తానని తెలిపారు. గతంలో 37 వేలు మెజారిటీ వచ్చిందని, ఈసారి 50 వేల మెజారిటీతో విజయం సాధిస్తానని అన్నారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ముఖ్యమంత్రికి వివరిస్తానని తెలిపారు.













