ఆ ఓటింగే మా విజయానికి సూచిక
ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 125 శాసనసభ నియోజకవర్గాల్లో విజయం సాధించనుందని విశాఖ ఉత్తర నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళలు అర్థరాత్రి వరకూ వేచి ఉండి ఓటు వేయడం తమ పార్టీ విజయానికి సూచికగా గుర్తిస్తామన్నారు. పోలింగ్ రోజున ఓటర్ల స్పందన ప్రజాస్వామ్యంపై వారి బాధ్యతకు నిదర్శనమని కొనియడారు. పోలింగ్ కేంద్రాల్లో 20 నుంచి 30 శాతం వరకు ఈవీఎంలు ప్రారంభంలో పనిచేయలేదని అన్నారు. ఉత్తర నియోజకవర్గంలో 37వ వార్డు 209 బూత్‌లో అర్ధరాత్రి రెండు గంటల వరకూ ఓటింగ్ జరిగిందన్నారు.













