ఎక్కడ రాజీ పడకుండా పోరాటం : గంటా
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో అనుభవం ఉన్న నాయకుడని, అందువల్లనే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎక్కడా రాజీ పడకుండా రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేస్తున్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి న్యాయం కోసం పోరాడుతున్న తెలుగుదేశం పార్టీపై విమర్శలు మాని పోరాటానికి కలిసి రావాలని బీజేపీ రాష్ట్ర నేతలకు సూచించారు. చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి, వైకాపా ఉచ్చులో పడ్డారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హరిబాబు వ్యాఖ్యానిచండం అసంబద్దమన్నారు. బీజేపీ అన్ని విధాలా రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు. ప్రధానిని కలిసేందుకు వెళ్తున్న ఎంపీలను లాక్కెళ్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజానాలకు అనుగుణంగా పోరాడుతున్నవారి పట్ల ఈ రకంగా ప్రవర్తించడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా బీజేపీ నేతలంతా కలిసి రావాలని, ముందుగా వారు రాష్ట్ర వాసులన్న అంశాన్ని గుర్తించుకొని వ్యవహరించాలని కోరారు.













