విశాఖకు వచ్చిన అవకాశాన్ని .. వదులుకోవద్దు
పేరుకు మూడు రాజధానులు అని చెప్పినా, పాలన అంతా విశాఖ నుంచే సాగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. మన విశాఖ… మన రాజధాని పేరిట శ్రీకాకుళంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ధర్మాన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్నేళ్ల తర్వాత విశాఖపట్నానికి వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని ప్రజలకు సూచించారు. అమరావతిలో 33 వేల ఏకరాలు సేకరించిన చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అంగీకరించలేదనే తమపై బురద జల్లుతున్నారని విమర్శించారు. విజయవాడ`గుంటూరు మధ్య రాజధాని వద్దని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందన్నారు. విశాఖ రాజధానిపై ప్రజల్లో చలనం తీసుకురావాలనే ఉద్దేశంతోనే రాజీనామా అన్నానని అన్నారు.













