Minister Swamy: రాష్ట్రంలో వైసీపీకి భవిష్యత్ లేదు : మంత్రి డీబీవీ స్వామి

వచ్చే ఎన్నికల్లో వైసీపీ డకౌట్ ఖాయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి డీబీవీ స్వామి (DBV Swamy) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ(YCP) కి భవిష్యత్ లేదని జగన్ (Jagan) కు అర్థమైందన్నారు. ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం. నవరత్నాల్లో ఒక్క రత్నమైనా జగన్ కోతల్లేకుండా అమలు చేశారా? ఆయనకు క్విడ్ ప్రోకో తప్ప పీపీపీ (PPP) అంటే కనీసం అర్థం తెలుసా? మెడికల్ కాలేజీ (Medical College) టెండర్లలో పాల్గొనవద్దని బెదిరిస్తారా? ప్రజల కోసమే పీపీపీ మోడ్‌లో మెడికల్ కాలేజీల నిర్మాణం జరుగుతాయి. జగన్ వైఖరి నచ్చకే ప్రజలు వైసీపీని పాతాళంలోకి నెట్టారు అని అన్నారు.