దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో…

దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కరోనా చికిత్సకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, అందుకే అందరూ ఏపీ వైపు చూస్తున్నారని ఆంధప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ తెలిపారు. కొవిడ్ కట్టడి కోసం కర్నూలు జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆదోని, నంద్యాల ఆస్పత్రిల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు కరోనాతో మరణించిన తల్లిదండ్రుల పిల్లలకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని పేర్కొన్నారు. కరోనా కట్టడికి ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా నివారణకు తగ్గు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, అధికారులతో వివరాలు సేకరించి గ్రామ స్థాయి నుంచి ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితులపై అడిగి తెలుసుకుంటున్నామని తెలిపారు.
ఫ్రంట్ లైన్ వారియర్స్ కు టీకాను అందజేశాం. వారితో పాటు వివిధ రంగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి కూడా టీకా వేయిస్తామన్నారు. రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఆక్సిజన్, బెడ్స్ ఇంజెక్షన్‍లపై అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలకు ప్రజలు సహకరించాలని కోరారు. కొవిడ్ కేర్ సెంటర్‍లో ప్రతి ఒక్కరూ చికిత్సతో పాటు భోజనం, మౌలిక సదుపాయలను కల్పిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మందులు, ఆక్సిజన్ అన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకు అందిస్తోంది. ఎక్కువగా రికవరిగా పొందిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఏపీనే అని తెలిపారు.