అందులో రోడ్‌షోలు, ర్యాలీలు నిషేధమని ఎక్కడుందో చెప్పాలి : మంత్రి బొత్స
జీవో నంబర్ వన్‌పై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు ముందు దాన్ని క్షుణ్ణంగా చదువుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పదేపదే విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు అసలు ఆ జీవోను ఇప్పటిదాకా చదివాయ అంటూ ప్రశ్నించారు. అందులో రోడ్‌షోలు, ర్యాలీలు నిషేదమని ఎక్కడుందో చెప్పాలని కోరారు. రోడ్లపై బహిరంగ సభలు పెట్టొదని మాత్రమే చెప్పాం. అవసరమైతే అనుమతి తీసుకొని బహిరంగ సభలు పెట్టుకోవచ్చు. జీవో నవంబర్ అన్ అన్ని పార్టీలకు వర్తిస్తుంది. వైఎస్ఆర్, జగన్ పాదయాత్రలో ఎంతో జాగ్రత్త తీసుకున్నాం. కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాం. ప్రజల పట్ల అందరూ బాధ్యతగా ఉండాలి అని మంత్రి పేర్కొన్నారు.













