కేటీఆర్కు ఎవరో ఫోన్ చేశారు… నేను స్వయంగా అనుభవించి వచ్చా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంట్, నీళ్లు లేవని రోడ్లన్నీ ధ్వంసమై ఉన్నాయని తన మిత్రులు చెప్పారంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. తాను చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నేను హైదరాబాద్ వెళ్లి స్వయంగా ఉండి వస్తున్నా. హైదరాబాద్లో అసలు కరెంటే ఉండటం లేదు. నేను జనరేటర్ వేసుకొని అక్కడి ఉండి వచ్చాను. కేటీఆర్కు ఎవరో ఫోన్ చేసి చెప్పారు. కానీ నేను స్వయంగా అనుభవించి వచ్చా. బాధ్యత కలిగిన వ్యక్తి అలా మాట్లాడటం తప్పు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తమ ఘనత ఏదైనా ఉంటే చెప్పుకోవచ్చు. ఎదుటివారి గురించి ఇలా మాట్లాడకూడదు అని అన్నారు.













