అందరికీ వారసులు ఉంటారు.. కానీ ఆమోదించాల్సింది వారే
అందరికీ వారసులు ఉంటారు కానీ, ప్రజలు ఆమోదించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా బొత్స మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ అంతిమ లక్ష్యమైనా గెలుపేనని అన్నారు. వారసులు అందరికీ ఉంటారు. నాకు మా అబ్బాయి ఉన్నాడు. మా వాడు వైద్య రంగం వైపు వెళ్లాడు. ఎవరైనా వారసుల్ని దింపొచ్చు అన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకు 175 గెలవాలనుకోవటం అత్యాశ కాదు. ఒక్క స్థానం పోయినా పర్యావేదు అనుకుంటే ఆ సంఖ్య క్షేత్రస్థాయిలో పది అవుతుంది. శాశ్వత అధ్యక్షుడి ఎన్నికపై నాకు సమాచారం లేదు. మా పార్టీ విషయాలు మేం మాట్లాడుకుంటాం. శాఖాపరమైన సమీక్షలు జరిపినట్టే పార్టీ పరంగా సీఎం ఎమ్మెల్యేల పనితీరు సమీక్షించి లోటుపాటు చెప్పారు. అని మంత్రి బొత్స వ్యాఖ్యనించారు.













