రాజధాని అమరావతిపై త్వరలో నిర్ణయం
వరదల వల్ల టీడీపీ నేతలకే ఇబ్బందులు తప్ప ఎవరికీ లేవని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు డ్రోన్ల రాజకీయం మీద ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదన్నారు. ఇల్లు మునగకపోతే చంద్రబాబు హైదరాబాద్కు ఎందుకు పారిపోయారు? అని ప్రశ్నించారు. రాజధాని అమరావతిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. అమరావతిలో ముంపు ప్రాంతాలు ఉన్నాయని పేర్కొన్నారు. ముంపును అరికట్టాలంటే కాల్వలు, డ్యామ్లు నిర్మించాల్సి ఉన్నందున నిర్మాణ వ్యయం ఎక్కువ అవుతుందని వివరించారు. వరద నీటిని తోడి బయటకు పంపించాల్సి ఉంటుందన్నారు. ఇదే సమయంలో స్థానిక సంస్థల నిర్వహణపై మంత్రి స్పందించారు. త్వరలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ముందుగా పరిషత్, తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.













