వికేంద్రీకరణకు మద్దతుగా… విశాఖ గర్జన ర్యాలీ
రాజధానుల వికేంద్రీకరణకు మద్దతుగా ఈ నెల 15న విశాఖ గర్జన ర్యాలీ చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ విశాఖలో అంబేడ్కర్ విగ్రహం నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు. దీనికి మద్దతుగా ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాలో ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అమరావతి పాదయాత్రను టీడీపీ పాదయాత్రగా ఆయన అభివర్ణించారు. దోపిడీదారులు, అవినీతిపరుల యాత్ర అని విమర్శించారు. విశాఖ పాలన రాజధానిగా చేస్తే వస్తే నస్టమేంటని ప్రశ్నించారు. ఇక్కడ అభివృద్ధి అంతా వైఎస్ హయాంలోనే జరిగిందని తెలిపారు.













