మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు.. కన్నెర్ చేస్తే చాలు ఆగిపోతాయి
కన్నెర్ర చేస్తే చాలు 5 నిమిషాల్లో పాదయాత్రలు ఆగిపోతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రజాస్వామ్యంలో అది పద్ధతి కాదని తెలిపారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే నష్టమేంటన్న బొత్స 10 వేల కోట్లు పెడితే ముంబయిని తన్నే నగరమవుతుందన్నారు. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రపై మంత్రి పలు సంచలన వ్యాఖ్యలు చేవారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే నష్టమేంటని ప్రశ్నించారు. కాకినాడ నుంచి ఇచ్ఛాపురం వరకు అభివృద్ధి జరగాలన్నారు. ఎన్టీఆర్ రెండు రూపాయలకి కిలో బియ్యం ఇచ్చాక అన్నం తిన్నామని, ఇది వాస్తవమని తెలిపారు. వైఎస్ జలయజ్ఞంతో తోటపల్లి, వంశధార ప్రాజెక్టులు వచ్చాయని, ఆ తర్వాత ఉత్తరాంధ్ర నుంచి వలసలు తగ్గాయని పేర్కొనానరు. 3 రాజధానులకు అనుకూలంగా సంఘాలన్నీ ర్యాలీ చేయాలని, ఒక ప్రాంతం, కొందరు వ్యక్తుల కోసం ఆలోచించకూడదని పిలుపునిచ్చారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడితే వచ్చేనష్టం ఏమిటి? అని ప్రశ్నించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే మూడు రాజధానులను సీఎం జగన్ ప్రకటించారని తెలిపారు.













