Atchannaidu: నేటితో ముగియనున్న నిషేధ కాలం : అచ్చెన్నాయుడు
సముద్రంలో ఇవాళ అర్థరాత్రి నుంచి తిరిగి చేపలవేట మొదలు కానుంది. ఈ ఏడాది ఏప్రిల్ 14 అర్థరాత్రి నుంచి జూన్ 14 వరకు సముద్రంలో చేపలు (Fish), రొయ్యలు, ఇతర మత్స్య, సంపద వేటపై కేంద్ర ప్రభుత్వం (Central Government) నిషేధం విధించిన విషయం తెలిసిందే. వేట నిషేధ సమయం ఇవాల్టితో ముగియనున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో చేపల వేట సాగించేందుకు మత్స్యకారులు (Fishermen) సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చేపల వేట సాగించాలని సూచించారు. వేట నిషేధ కాలంలో మత్స్యకారుల సేవలో భాగంగా రాష్ట్రంలోని 1,29,178 మంది మత్స్యకారులకు రూ.258.356 కోట్లను వేట నిషేధిత కాలం భృతి క్రింద అందజేశారు. ఒక్కో లబ్ధిదారునికి రూ.20 వేలు చొప్పున బ్యాంక్ ఖాతాలకు జమచేసి, మాట నిలబెట్టుకున్నం దుకు గర్వంగా ఉందని అన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే కూటమి ప్రభుత్వం రెట్టింపు భృతి ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.













