Visakhapatnam: విశాఖపట్నం ఇప్పుడో గొప్ప ఐటీ హబ్ : మంత్రి అనగాని
గతంలో ఎప్పుడూ చూడని సంస్థలు ఇప్పుడు విశాఖ వైపు చూస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satyaprasad) అన్నారు. కలెక్టరేట్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నం(Visakhapatnam) ఇప్పుడో గొప్ప ఐటీ హబ్ (IT Hub) అని చెప్పారు. విశాఖ మెట్రో (Metro) కోసం భూ సమీకరణ అంశంపై చర్చించాం. పంచ గ్రామాల సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టాం. జీవో నంబర్ 296 సమస్యను నెలలో పరిష్కరిస్తాం. పదవిలో ఉన్నప్పుడు పనులు చేయలేని వారు, ఇప్పుడు పనికిమాలిన కబుర్లు చెబుతున్నారు. విశాఖ బీచ్ వెంబడి సీఆర్‌జడ్ (CRZ) సమస్యలపైనా దృష్టి సారించాం. తరతరాల నుంచి వచ్చిన భూ సమస్యలు పరిష్కరిస్తాం. భూములు ఇచ్చిన నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తాం అని అన్నారు.







