Satya Prasad : కుట్ర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా… తాడేపల్లి ప్యాలెస్
ఎన్ని దుష్టశక్తులు ఎదురొచ్చినా కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Satya Prasad) అన్నారు. బాపట్ల జిల్లా సజ్జావారిపాలెంలో నిర్వహించిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంల మంత్రి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన మంచి పనులు, ప్రవేశ పెట్టిన పథకాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నామని తెలిపారు. యువత, మహిళలు, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని చెప్పారు. తాడేపల్లి ప్యాలెస్ (Tadepalli Palace )కుట్ర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని మండిపడ్డారు. యువతలో ఉగ్రవాదాన్ని ప్రేరేపించేలా జగన్ (Jagan ) వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సింగయ్య (Singayya ) మరణంపై వైసీపీ (YCP) నేతలు నాటకాలాడుతున్నారని, మనిషి ప్రాణానికి విలువ ఇవ్వకుండా కుట్ర రాజకీయాలు చేయడం బాధాకరమన్నారు.













