మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు.. మా హయాంలోనే పూర్తి
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టుపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ పోలవరానికి మొదట్లో శ్రీరామపాద సాగర్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్ట్‌గా మార్చారు. పోలవరం నిండితే శ్రీశైలం నుంచి రాయలసీమకు నీరందించే అవకాశం ఉంటుంది. ఇరిగేషన్ సస్యశ్యామలం చేయాలని ఆనాడు భావించి మహానేత వైఎస్ఆర్ జలయజ్ఞం ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడంతో పాటు మహానేత వైఎస్ఆర్ అన్ని అనుమతులు తీసుకువచ్చారు. గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చినా వైఎస్ఆర్ మాత్రమే పోలవరంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇరిగేషన్‌ను సస్యశ్యామలం చేయాలని జలయజ్జం తీసుకువచ్చారు. పోలవరం ప్రతీ నిటీ బొట్టుపై వైఎస్ఆర్ అని ఉంటుంది. పోలవరం పూర్తి చేసేది మేమే. మా హయాంలోనే పోలవరం పూర్తి అవుతుంది. ఇది దైవ నిర్ణయం. మా ప్రభుత్వ హయాంలో పోలవరం నిర్మాణానికి సంబంధించిన రూ.2,600 కోట్ల పెండిరగ్ నిధులు కేంద్రం నుంచి రావాలి అని మంత్రి స్సష్టం చేశారు.













