రాజధాని తరలింపు పై … మంత్రి అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు
విశాఖకు రాజధాని తరలింపుపై రాష్ట్ర మంత్రి అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి విశాఖ ఎప్పుడు వస్తారో డేట్ ఎందుకు చెప్పాలని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను భారత్-కెన్యా మ్యాచ్‌తో మంత్రి పోల్చి చెప్పారు. కెన్యా గెలిచినట్లే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ గెలిచిందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను సమీక్షించుకుంటామని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక సెక్టార్‌కు సంబంధించిన ఎన్నికలని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలు కేవం రెండు శాతం వర్గానికి సంబంధించినవి అని తెలిపారు. 2 శాతంతో కూడా 36 శాతం ఓటింగ్ తమకు వచ్చిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు మూడు రాజధానులకు రెఫరెండమని తాము అనలేదున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు సెమి ఫైనల్ అని కూడా అనలేదని స్పష్టం చేశారు. విశాఖ నుంచి పాలిస్తానని ముఖ్యమంత్రి జగన్ స్వయంగా చెప్పారని మంత్రి పేర్కొన్నారు.













