అమెరికాలో రోడ్ షో : మంత్రి అమరనాథ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంలో భాగంగా అమెరికాలో రోడ్‌షోకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి 2 నుంచి వారం రోజుల పాటు దీన్ని నిర్వహించనుంది. ఇందుకు గాను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ నేతృత్వంలోని అధికారుల బృందం అమెరికాకు బయలుదేరనుంది. విశాఖను బీచ్ ఐటీ డెస్టినీగా తీర్చిదిద్దే విధంగా జనవరి 20`21 తేదీల్లో ఇన్ఫినిటీ వైజాగ్, ఫిబ్రవరి 16,17 తేదీల్లో గ్లోబల్ ఐటీ సమ్మిట్లను నిర్వహిస్తున్నట్లు ఐటీ శాఖాధికారుల తెలిపారు.













