నా పేరు మీకు తెలియదేమో.. ఉత్తరాంధ్ర ప్రజలకు తెలుసు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్యాకేజీకి అమ్ముడుపోయి జనసేన అదినేత పవన్ కల్యాణ్ ఇష్టానుసారం అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అమర్నాథ్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరు దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన తమ కుటుంబంపై నోటికొచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు. యువశక్తి సభ ద్వారా యువతకు ఏం సందేశం ఇచ్చారని ప్రశ్నించారు. మా తాత నుంచి మా కుటుంబం రాజకీయాల్లో ఉంది. మా తండ్రి మంత్రిగా చేశారు. నేను మంత్రిగా కొనసాగుతున్నాను. నా పేరు మీకు తెలియదేమో. ఉత్తరాంధ్ర ప్రజలకు తెలుసు. నీలాంటి వారి నోటి నుంచి నా పేరు రావడం కూడా ఇష్టం లేదు. జనసేనను చంద్రసేనగా మార్చేశారని పననే చెప్పారు. పీఎస్పీ కే అంటే పవన్ కల్యాణ్ ప్యాకేజ్ స్టార్, చంద్రబాబుతో రెండు గంటల పాటు దేశ రాజకీయాలపై మాట్లాడారంటే ఎవరూ నమ్మరు. సీట్లు, ప్యాకేజీ పంపకాల గురించే చర్చించారు. డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేసి చెప్పగలరా? ప్రశ్నించారు. లక్ష్మీనరసింహస్వామి, చిరంజీవిపై ప్రమాణం చేసి చెప్పాలి. రాజకీయాల్లో జగన్ హీరో, పవన్ కల్యాన్ విలన్ అని అన్నారు.













