జగన్ తరుపున మాట ఇస్తున్నా, పరిక్షలకు భయం వద్దు: ఏపీ మంత్రి

ఇంటర్మీడియట్ పరీక్షలు వచ్చే నెల 5 న ప్రారంభం అయ్యి 19న పూర్తి అవుతాయి అని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ సంబంధిత సెంటర్ లకు చేరవేశాము అని ఆయన మీడియాకు వివరించారు. గత సంవత్సరం తో పోల్చితే ఈ సంవత్సరం 41 సెంటర్స్ పెంచామని తెలిపారు. అత్యధికంగా ఈస్ట్ గోదావరిలో, అతి తక్కువగా గుంటూరులో సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నాం అని ఆయన వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1452 సెంటర్ లు ఏర్పాటు చేస్తున్నాం అని పేర్కొన్నారు.
ప్రతిజిల్లాకు ఒక కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ ను నియమించాము అని అన్నారు. సెంటర్ ల పర్యవేక్షణ కు స్క్వాడ్ లు, మొబైల్, ఫ్లైయింగ్ స్క్వాడ్ లు వుంటారు అని పేర్కొన్నారు. పరీక్ష కు ముందు రోజు ప్రతి సెంటర్ ల లో సోడియం హైపోక్లోరిడ్ స్ప్రే చేయాలని అదేశించామని వివరించారు. ఎవరికైనా స్వల్ప లక్షణాలు ఉంటే ఐసోలెట్ రూమ్ లో పరీక్షలు రాయించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు. ఆ రూమ్ లో వుండే ఉపాధ్యాయులు కు పి పి ఈ కిట్ లు అందచేయాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
దేశం లో ఎక్కడ కూడా ఇంటర్ పరీక్షలు ను రద్దు చేయలేదు అని ఆయన తెలిపారు. పరీక్షలు నిర్వహణపై నిర్ణయం రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చింది అని స్పష్టం చేసారు. పిల్లల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం అని అన్నారు. రాజకీయ నిర్ణయాలకు కోసం పిల్లలను ఉపయోగించుకోవడం మంచిది కాదు అని అన్నారు ఆయన. పరీక్షలు లేకుండా పాస్ సర్టిఫికెట్ తీసుకుని మంచి కాలేజీ లో సీట్ సంపాదించడం కష్టం అని స్పష్టం చేసారు. పరీక్షలు కోసం సంవత్సరం కాలం వారు పడ్డ కష్టానికి ప్రతిఫలం లేకపోతే వారు చివరి అంకం లో నాశనం అయినట్టు అవుతుందన్నారు. పరీక్షలు రాయడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అని చెప్పుకొచ్చారు.
పరీక్షల నిర్వహణ చాలా జగర్తగా నిర్వహిస్తోంది అని ప్రభుత్వం తరపున, ముఖ్యమంత్రి తరపున మాటిస్తున్నాం అని అన్నారు. bie.ap.gov.in ద్వారా విద్యార్థులు ఈ క్షణం నుండి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని సూచించారు. IPE EXAM CENTER లోకేటర్ APP లో ఎక్సమ్ సెంటర్ వివరాలు, రూట్ మాప్ ఉంటుంది అన్నారు. హాల్ టికెట్ పై కోవిడ్ సందర్భంగా పాటించాల్సిన జగర్తలు ముద్రించామని వివరించారు. వైద్య, విద్య, పోలీస్, రెవిన్యూ , సాధారణ పరిపాలన శాఖ సమన్వయం తో పరీక్షలు నిర్వహిస్తాం అన్నారు. కోవిడ్ పాజిటివ్ఉన్న వారు పరీక్షలకు హాజరు కావద్దు అని సూచించారు. వారు పొసిటీవ్ సర్టిఫికెట్ సమర్పిస్తే సప్లమెంటరీ కి అవకాశం ఇచ్చి సర్టిఫికెట్ లో రెగులర్ అని నమోదుచేస్తాం అని తెలిపారు.