కరోనా చికిత్సల కోసం రూ.350 కోట్లు
కరోనా కేంద్రాల్లో భోజనం, పారిశుద్ధ్యంపై ఆరోపణలు చేస్తున్నారని అలాంటి ఆరోపణలు వైద్యుల మనోధైర్యం దెబ్బతీసే చర్యలని ఆంధప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. రాష్ట్రంలో కరోనా చికిత్సలపై వస్తున్న ఆరోపణలు, ప్రస్తుత పరిస్థితులపై ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా చికిత్సల కోసం రూ.350 కోట్లు ఖర్చవుతోందన్నారు. కోలుకున్న వారి నుంచి ప్లాస్మా సేకరణ ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. కరోనాతో మృతి చెందిన వారి దహన సంస్కారాలను ఎవరూ అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. చికిత్సకు అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉంచామని, గత 6 నెలలుగా 17 వేల మంది నిపుణులను నియమించామని మంత్రి పేర్కొన్నారు. కరనా పరీక్షల కోసం 20 ల్యాబ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్సకు నిరాకరించినా, అధిక ధరలు వసూలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.













