ఏపీ ఎన్నికల ఫలితాలకు ఆ 60 లక్షల మందే కీలకం…
ఆంధ్రాలో సార్వత్రిక ఎన్నికల సమరం మే 13 తో ముగిసింది. ఇక మిగిలింది ఫలితాల విడుదల మాత్రమే. జూన్ 4న ఎవరు గెలుస్తారు అన్న విషయంపై స్పష్టత వస్తుంది. ఆంధ్రాలో 175 అసెంబ్లీ స్థానాలకు..25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మే 13న జరిగిన పోలింగ్ కు రికార్డు స్థాయిలో 82% ఓటింగ్ నమోదైంది. పోలింగ్ శాతం పెరగడం తో కొందరు ప్రభుత్వ వ్యతిరేకతకు ఇది నిదర్శనం అని అంటున్నారు.. మరికొందరు ప్రభుత్వానికి మద్దతుగా ఎన్ని ఓట్ల పోలింగ్ జరిగింది అని అంటున్నారు. పోటెత్తిన ఓటర్లు ప్రభుత్వానికి మద్దతుగా తరలివచ్చారా.. లేక ప్రతిపక్షానికి అనుకూలంగా వచ్చారా అన్న విషయం తేలడానికి మరి కొద్ది రోజుల సమయం ఉంది..
వైసీపీ.. టీడీపీ.. లెక్కలు ఎలా ఉన్నప్పటికీ.. 60 లక్షల మంది మాత్రం ఈ ఎన్నికల్లో చాలా కీలకం అన్న టాక్ నడుస్తోంది. మన రాష్ట్రంలో పేద, ధనిక, మధ్య తరగతి ప్రజలు ఉన్నారు..అంచనాల ప్రకారం ధనికులు ఎక్కువగా విపక్ష కూటమి వైపు మొగ్గినట్లు తెలుస్తోంది. పేదలు వైసీపీ కు మద్దతు తెలుపుతున్నారు అని అంచనా. అయితే ఇక్కడ మిగిలిపోయినది మధ్యతరగతి ప్రజలు. వీరు ఎటువైపు ఉన్నారు అన్న విషయం రాష్ట్రంలో ప్రస్తుతం గెలుపు.. ఓటములు ఏ పార్టీదో నిర్ణయిస్తుంది. రాష్ట్రంలో సుమారు 60 లక్షల మంది మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నారు. అయితే వీరు మళ్లీ వైసీపీ సర్కారు రావాలి అనుకుంటున్నారా.. లేక అధికార పార్టీని గద్దధించి..ప్రతిపక్షానికి మద్దతుగా నిలవాలి అనుకుంటున్నారా అన్న విషయం కీలకంగా మారనుంది.
వైసీపీ సర్కార్ సంక్షేమ పథకాలు పేదలకే కాకుండా అర్హులైన మధ్యతరగతి కుటుంబాలకి కూడా అందుతున్నాయి. అమ్మబడి, ఇళ్ల పట్టాలు, రైతు భరోసా, పెన్షన్లు.. ఇలా చాలా పథకాల వల్ల మధ్యతరగతి కుటుంబీకులు కూడా లబ్ధి పొందుతున్నారు. వీరు ఈ ఐదు సంవత్సరాలలో తమకు మేలు జరిగింది అని భావిస్తే జగన్ వైపు మొగ్గు చూపుతారు.. కాదు అధికారం మార్చాలి అని భావిస్తే టీడీపీ కు అది ప్లస్ పాయింట్ అవుతుంది. మరి 60 లక్షల కుటుంబాలలో మెజారిటీ ఏ పార్టీ పక్క ఉంది అన్న విషయం జూన్ 4న తేలిపోతుంది.













