ఎమ్మెల్యేగా మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రమాణ స్వీకారం
కర్నూలు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఛాంబర్లో స్పీకర్ తమ్మినేని సీతారాం ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మేకపాటిని శాలువాతో సన్మానించారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసాస్తో పాటు వైసీపీ నాయకులు మేకపాటికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఏపీ సచివాయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గౌతమ్ అన్న ఆశయాలను నెరవేరుస్తానన్నారు. గెలిపించిన ఆత్మకూరు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఉప ఎన్నికల్లో విక్రమ్ రెడ్డి 82,888 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.













