ఆత్మకూరు ఉప ఎన్నిక నామినేషన్ దాఖలు చేసిన విక్రమ్ రెడ్డి
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా విక్రమ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సీఎం జగన్ చేతుల మీదుగా బీ ఫారం అందుకున్న మిక్రమ్రెడ్డి నేడు నామినేషన్ దాఖలు చేశారు. బైపాస్‌రోడ్డులోని అభయాంజనేయస్వామి ఆలయంలో విక్రమ్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నెల్లూరు సెంటర్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. విక్రమ్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డితో పాటు వైఎస్ఆర్సీ నేతలు పాల్గొన్నారు.













