ఆ భయంతోనే చంద్రబాబుని అరెస్టు చేశారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైశాచిక ఆనందం కోసమే చంద్రబాబును అరెస్టు చేశారని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా మర్రిపాడులో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టుతో వైసీపీ రాజకీయంగా నేలమట్టమైంది. వైఎస్ పేరు వాడుకొని స్వార్థం కోసం జగన్ సీఎం అయ్యారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే చంద్రబాబును అరెస్టు చేశారు. చంద్రబాబు అరెస్టు వల్ల వైసీపీకి నష్టమే గానీ లాభం లేదు. కాబోయే సీఎం చంద్రబాబే. మా అన్న రాజమోహన్ వల్లే వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యా. న్యాయంగా ఎన్నికలు నిర్వహిస్తే చంద్రబాబే ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు.













