వైసీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు… చంద్రబాబు అధికారంలోకి వస్తేనే
వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వినాయకుడి ఆశీస్సులతో చంద్రబాబు బయటకు వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబుకు, ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నానన్నారు. వైసీపీ నన్పు సస్పెండ్ చేసింది. త్వరలోనే టీడీపీలో చేరతా. చంద్రబాబు అరెస్టు కాకుండా ఉంటే ఇప్పటికే పార్టీలో చేరేవాడిని. చేరికపై జవాబు వచ్చాక పార్టీలో అధికారికంగా చేరతా అన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినా నా గ్రాఫ్ బాగాలేదని సీఎం తెలిపారు. నేను తప్ప ఉదయగిరిలో ఎవరూ గెలవలేరు. చంద్రబాటు టికెట్ ఇస్తే మరోసారి గెలుస్తా. టికెట్ ఇవ్వకపోయినా టీడీపీలోనే కొనసాగుతా. రాష్ట్రంలో ధర్మం, న్యాయం లేదని ప్రజలకు అర్థమైంది. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే న్యాయం, ధర్మం జరుగుతుందని అని అన్నారు.













