మెఘా ఇంజనీరింగ్ సంస్థ మరో రికార్డు
నిర్మాణరంగంలో పేరుగాంచిన మెఘా ఇంజనీరింగ్ సంస్థ మరో రికార్డును సొంతం చేసుకుంది. గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం బహుళార్థ సాధన ప్రాజెక్టులో జలవిద్యుత్ కేంద్రం టన్నెల్ తవ్వకాల్లో ఈ రికార్డును సాధించింది. జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనుల్లో కార్మికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. 2020 మార్చి నుండి ఈ ఏడాది ఫిబ్రవరి చివర వకూ 4 మిలియన్ సేఫ్ మెన్ అవర్స్ సర్టిఫికెట్ను పొందింది. జలవిద్యుత్ కేంద్రంలో భాగంగా ఉన్న కొండ తవ్వకం పనుల్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పనులు పూర్తి చేసింనదుకు జలవనరులశాఖ నుండి ఈ సర్టిఫికెట్ పొందింది. కొండను తొలిచి భద్రతా పరమైన లోపాలు తలెత్తకుండా పనులు సాగించింది. జలవిద్యుత్ కేంద్రం కొండను తొలిచి టన్నల్ నిర్మించటంలో అధునాతన సాంకేతికతను వాడిన మొఘా ఇంజనీరింగ్ సంస్థ నైపుణ్యతను ప్రదర్శించిన భద్రతా చర్యలు చేపట్టినందుకు గాను 5 మిలియన్ సేఫ్మెన్ సర్టిఫికెట్ను పొందగలింది.













