జనసేన పార్టీకి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం
జనసేన విజయాన్ని కాంక్షిస్తూ ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి రూ.5 కోట్ల విరాళం ఇచ్చారు. హైదరాబాద్ నగర శివారులోని ముచ్చింతల్ విశ్వంభర షూటింగ్ లొకేషన్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఇద్దరూ వెళ్లి చిరంజీవిని కలిశారు. ఆత్మీయ ఆలింగనంతో సోదరులకు ఆయన స్వాగతం పలికారు. చిరంజీవి పాదాలకు నమస్కరించిన పవన్ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. కొద్దిసేపు ముగ్గురూ మాట్లాడుకున్నారు. నీ వెనుక నేనున్నానంటూ చిరంజీవి భరోసా ఇచ్చారు. అనంతరం విరాళానికి సంబంధించిన చెక్కులను అందించి ఆశీర్వదించారు.













