పవన్ కోసం మెగా ఫ్యామిలీ మొత్తం ఏకమవుతోందా..?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అటు సినిమాలు, ఇటు రాజకీయాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. సినిమాల్లో సంపాదిస్తున్న డబ్బును పార్టీకోసం ఖర్చు పెడుతున్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలనేది ఆయన తపన. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనేది పవన్ కల్యాణ్ లక్ష్యం. ఇందుకోసం టీడీపీతో కలిసి పోటీ చేస్తారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అయితే మెగా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ దొరుకుతుందా లేదా అనేది సందేహంగా ఉంది. ఎందుకంటే చిరంజీవి ఇంతవరకూ తన తమ్ముడు పవన్ కల్యాణ్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు. కానీ ఇప్పుడు పవన్ కోసం మెగా ఫ్యామిలీ మొత్తం ఏకమవుతున్నట్టు కనిపిస్తోంది.
పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత ఇంతవరకూ మెగాస్టార్ జనసేన పార్టీ స్టేజ్ ఎక్కలేదు. పవన్ కల్యాణ్ పార్టీకి ఓటేయాలని కూడా కోరలేదు. ఆయన పార్టీకి, తనకు ఏదీ సంబంధం లేనట్టు వ్యవహరిస్తూ వచ్చారు. పవన్ కల్యాణ్ కూడా ఎప్పుడూ మెగాస్టార్ ను కలిసి పార్టీకోసం పని చేయాలని అడగలేదు. కానీ నాగబాబు మాత్రం పార్టీలో చేరారు.. సీరియస్ గా పనిచేస్తున్నారు. కానీ మెగా ఫ్యాన్స్ అంతా చిరంజీవి పిలుపుకోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ సమయం వచ్చినట్టు కనిపిస్తోంది. చిరంజీవి ఈ మధ్య వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ సెటైర్లు వేశారు. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న చిరంజీవి ఇప్పుడు వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చే స్థాయికి రావడం శుభపరిణామం అని సంబరాలు చేసుకుంటున్నారు.
మరోవైపు పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా పవన్ కు మద్దతుగా నిలిచారు. ఈ మధ్య వైసీపీ నేతలు ప్రతిసారీ మూడు పెళ్లిళ్లు అని విమర్శిస్తూ వస్తున్నారు. దీనిపై పవన్ కల్యాణ్ ఎన్నోసార్లు సమాధానం చెప్పినా వైసీపీ నేతలు మాత్రం అనడం మానట్లేదు. అందుకే రేణుదేశాయ్ రంగంలోకి దిగారు. తను మంచివాడని, ప్రజా సేవకోసం ఫ్యామిలీని సైతం వదిలేశారని బాసటగా నిలిచారు. రేణు దేశాయ్ ఇలా వీడియో రిలీజ్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ పవన్ కల్యాణ్ గురించి ఇంత పాజిటివ్ గా ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఇప్పుడు ఆమె స్వయంగా ముందుకొచ్చి పవన్ కు మద్దతుగా నిలవడంతో జనసైనికులకు కొండంత ధైర్యం వచ్చినట్లయింది.
పవన్ కల్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు ఏకమవుతున్నట్టు కనిపిస్తోంది. మెగా ఫ్యామిలీలో చిరంజీవి, రేణు దేశాయ్ ఇంతవరకూ పవన్ కల్యాణ్ కు అనుకూలంగా ఎప్పుడూ మాట్లాడలేదు. మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అంతా సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా పవన్ కు మద్దతుగా నిలబడ్డారు. కానీ ఇప్పుడు వాళ్లిద్దరు కూడా బహిరంగంగా బాసటగా నిలవడం ఎన్నికల ముందు పార్టీకి పెద్ద బూస్ట్ ఇచ్చినట్లయింది. ఎన్నికల్లో ఈసారి మెగా ఫ్యామిలీ మొత్తం ప్రచారం చేయడం ఖాయమని జనసైనికులు భావిస్తున్నారు. వైసీపీ నేతలే మెగా ఫ్యామిలీని మొత్తం ఏకమయ్యాలే చేశారని చెప్పుకుంటున్నారు.













