Jubilee Hills : జూబ్లీహిల్స్‌లో గెలిచి చరిత్ర సృష్టిస్తాం: మీనాక్షి నటరాజన్

బడుగు బలహీన వర్గాలు, పేదలు, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు పెంచే అద్భుతమైన సంక్షేమ పథకాలు తెలంగాణ (Telangana) లోనే అమలవుతున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) అన్నారు. జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నిక సందర్భంగా సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెంగళరావునగర్, యూసుఫ్‌గూడ, బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లలో జరిగిన బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పేదలకు సన్నబియ్యం, ఎస్సీ వర్గీకరణను పూర్తిస్థాయిలో చేపట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కింది అని అన్నారు. ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ (Congress Party) విధానాలను వివరించాలని కార్యకర్తలను కోరారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో గెలిచి చరిత్ర సృష్టిస్తామని అన్నారు.