ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకంతో ప్రయోజనం : మేడపాటి వెంకట్
ఇతర దేశాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసులు మరణిస్తే ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం ద్వారా రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు సంఘం (ఏపీఎన్ఆర్టీఎస్) అధ్యక్షుడు మేడపాటి వెంకట్ వెల్లడించారు. కేంద్రం ఈ పథకానికి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తోందని, దాన్ని తాము సులభతరం చేసి, అందరికీ చేరువ చేశామని తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకు 2.55 లక్షల మంది లబ్ధి పొందారు. 489 మంది లబ్ధిదారులకు రూ.2.44 కోట్ల పరిహారం అందజేశాం. విద్యా వాహిని ద్వారా విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. అత్యవసర సమయాల్లో నిరాశ్రయులైన, అర్హులైన వలసదారులను, ఏజెంట్ల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న వారిని భారత రాయబార కార్యాలయాల సహాయంతో త్వరగా స్వదేశానికి తీసుకు రవడానికి ఏపీఎన్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తుంది అని పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లానుకునే వారు, ప్రస్తుం విదేశాల్లో ఉన్నవారు ఏపీఎన్ఆర్టీఎస్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. తద్వారా వారికి ఏవైనా సమస్యలు ఎదురైనపుడు సంప్రదించడానికి మార్గం సుగమం అవుతుంది అని సీఈవో హేమలత రాణి తెలిపారు.







