ఒకే మహిళతో నాలుగు సార్లు పెళ్లి… మూడుసార్లు విడాకులు ఎందుకో తెలుసా?
ఓ వ్యక్తి ఒకే మహిళలను నాలుగు సార్లు పెళ్లి చేసుకొని, మూడు సార్లు విడాకులు ఇచ్చాడు. అదే మహిళను అన్ని సార్లు పెళ్లి చేసుకోవడం మళ్లీ విడాకులు ఇవ్వడం ఎందుకంటే. ఇదంతా కేవలం సెలవుల కోసమే. పెళ్లికి సెలవులు తీసుకునే అవకాశం ఉండటంతో దానిని ఓ బ్యాక్ ఉద్యోగి ఇలా వినియోగించుకున్నాడు. తైవాన్ రాజధాని తాయ్‌పెయ్ నగరంలో ఓ బ్యాంక్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్న వ్యక్తి సుమారు నెల రోజుల వ్యవధిలో ఒకే మహిళను 4 సార్లు పెళ్లి చేసుకున్నాడు. కేవలం తన సంస్థ నుంచి సెలవు పొడిగింపు కోసమే అతనీ పని చేశాడు.
తైవాన్ కార్మిక చట్టం ప్రకారం ఏ ఉద్యోగికైనా పెళ్లికి 8 రోజుల సెలవు తప్పనిసరిగా ఇవ్వాలి. దీన్ని సాకుగా చూపి ఈ పెళ్లి స్టంట్ చేశాడు. సంస్థ మంజూరు చేసిన 8 రోజుల సెలవులతో అతను సంతృప్తి చెందలేదు. ఎక్కువ రోజులు సెలవు కావాలనుకున్నాడు. దీంతో అతను తన భార్యకు విడాకులు ఇవ్వడం.. మళ్లీ పెళ్లి చేసుకోవడం ఇలా సెలవుల కోసం దరఖాస్తు చేశాడు. అందుకుగాను మొత్తం 32 రోజుల కోసం లీవ్ అప్లై చేశాడు. అయితే అతను పనిచేస్తున్న బ్యాంక్ వారు ఈ విషయాన్ని పసిగట్టి అతనికి లీవ్‌ను పొడిగించేందుకు నిరాకరించారు. దీంతో సదరు వ్యక్తి కోర్టుకెక్కాడు.













