Marri Rajasekhar : ఎలాంటి షరతులు లేకుండానే…త్వరలో తెలుగుదేశం పార్టీలో
ఎలాంటి షరతులు లేకుండానే తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)లో చేరతానని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్ (Marri Rajasekhar) తెలిపారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ (YCP)లో అవమానాలు భరించలేక ఎమ్మెల్సీ (MLC) పదవీ కాలం ఇంకా నాలుగేళ్లు ఉన్నప్పటికీ రాజీనామా చేశా. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాతే మరోక పార్టీలోకి వెళ్తున్నా. పార్టీ నాయకుడు ఎప్పుడూ తన హామీని నిలబెట్టుకోలేదు. పార్టీకి అవసరం లేదన్నట్టుగా వ్యవహరించారు. 14 ఏళ్ల పనిచేసిన పార్టీలో గౌరవం మాత్రమే కోరా అని వివరించారు.













