ఆ పని చేసింది జీవీఎలే : మార్గాని భరత్
కేంద్ర హోంశాఖ అజెండా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తొలగించడానికి కారణం బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు కారణమని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగువారై ఉండి ప్రత్యేక హోదాను జీవీఎల్ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్ర హోంశాఖ సమావేశంలో తొలగించిన ప్రత్యేకహోదా అంశాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అన్యాయంపై 22 మంది వైఎస్ఆర్సీపీ ఎంపీలు అనేకసార్లు పార్లమెంటులో మాట్లాడామని అన్నారు. ఎంపీ మాట్లాడటం వల్లే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆంధ్రాకు అన్యాయం జరిగిందని రాజ్యసభలో అన్నారని భరత్ ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా చెప్పారని ఆయన గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 2,100 కోట్లు రీయింబర్స్మెంట్ చెయ్యాల్సి ఉంది. ఏపీలో కొత్త జాతీయ రహదార్లు వేస్తున్నందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.













