పార్టీకి రాజీనామా చేసిన నెల్లూరు జనసేన పార్టీ అధ్యక్షుడు..
ఆంధ్రాలో ఎన్నికలు సమీపిస్తున్న టైంలో జనసేనకు వరుస షాకులు తగులుతున్నాయి. పార్టీ కోసం ఏళ్ల తరబడి పని చేసిన నేతలు అసంతృప్తితో ఒక్కొక్కరూ పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. పొత్తులో భాగంగా కేవలం 21 సీట్లు రావడం.. అవి కూడా వలస వచ్చిన నేతలకు ఇవ్వడం పార్టీలో ఇప్పటికే ఉన్నవారికి తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుంది.
ఈ నేపథ్యంలో తాజాగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన పవన్ కళ్యాణ్ కు రాసిన లేఖలో వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దాదాపు 6 సంవత్సరాలుగా జిల్లాలో పార్టీ కోసం పని చేసిన మనుక్రాంత్ రెడ్డి పార్టీని వీడి వెళ్లడం జనసేనకు పెద్ద షాక్. నెల్లూరు సిటీ టికెట్ ఆశించిన మనుక్రాంత్ రెడ్డి.. పొత్తుల భాగంగా టికెట్ టిడిపికి కేటాయించడం తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు అని టాక్. నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయ్ సాయి రెడ్డి.. తమ పార్టీలో మంచి స్థానాన్ని కల్పిస్తామని మాట ఇచ్చి మనుక్రాంత్ రెడ్డిని వైసీపీ వైపు మొగ్గేలా చేశారు అని కొందరు భావిస్తున్నారు.













