ఏపీ పీఆర్సీ చైర్మన్ గా మన్మోహన్ సింగ్
ఉద్యోగుల వేతన సవరణకు 12వ పీఆర్సీని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్సీ చైర్మన్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి మన్మోహన్సింగ్ను నియమించింది. ఏడాదిలోగా పీఆర్సీ వివిధ అంశాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వివిధ ప్రభుత్వ శాఖలు, కేటగిరీలకు చెందిన ఉద్యోగులందరి వివరాలు, వారికి సంబంధించిన అంశాలతో పాటు స్థానికంగా ఉన్న పరిస్థితులు, కరువు భత్యంపై అధ్యయనం చేసిన తర్వాత సిఫార్సులు చేయాలని పీఆర్సీకి ప్రభుత్వం సూచించింది.













