అందుకే ఈ ఎన్నికల్లో కూటమికి .. మద్దుతు ఇస్తాం : మందకృష్ణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఐదేళ్లలో మాదిగలకు సంక్షేమం లేకుండా చేసిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని అంబేడ్కర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో జగన్కు వ్యతిరేకంగా పోరాటం చేసి తగిన బుద్ధి చెప్తామన్నారు. మాదిగల సంక్షేమం పట్ల సీఎంకు చిత్తశుద్ధి లేదని, ఇటీవల ప్రకటించిన పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల్లో కూడా మాదిగలకు ప్రాధాన్యం ఇవ్వలేదని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలో దళిత, గిరిజనులకు సంక్షేమ పథకాలు పూర్తి రద్దయ్యాయి. గతంలో ఉన్న విదేశీ విద్య పథకానికి అంబేడ్కర్ పేరు తీసేసి జగన్ పేరు పెట్టడమేంటి? ప్రశ్నించారు. గత ప్రభుత్వం మాదిగ కులానికి ప్రాధాన్యమిచ్చింది. నరేంద్ర మోదీ కూడా మమ్మల్ని గుర్తించారు. అందుకే ఈ ఎన్నికల్లో టీడీపీ-జసేనన-బీజేపీ కూటమికి మద్దుతు ఇస్తాం. త్వరలో కూటమి అగ్ర నేతలను కలిసి మాట్లాడతా అని తెలిపారు.













