సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి `నెంబరు వన్’ చానల్ యజమాని తెలుగుదేశంపార్టీలో చేరారు
సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి `నెంబరు వన్’ చానల్ యజమాని మంచాల సాయి సుధాకర నాయుడు తెలుగుదేశంపార్టీలో చేరారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును పెద్దేత్తున అనుచరులతో వచ్చి కలిసారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంచాల సాయి సుధాకర నాయుడు, ఆయన ముఖ్య అనుచరులకు పసుపు కండువా వేసి తెదేపాలోకి ఆహ్వానించారు.
మంచాల సాయి సుధాకర నాయుడు 25 ఏళ్లుగా కాపు ఉద్యమంలో మమేకం కావడం అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కోన్నారు. కాపులకు న్యాయం కోసం అహర్నిశలు కృషి చేశారన్నారు. కాపుల హక్కుల సాధనకు నిరంతరం శ్రమించిన మంచాల సాయి సుధాకర నాయుడు అని ప్రశంసించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, కాపుల సంక్షేమానికి చేస్తున్న కృషిని గుర్తించి తెదేపాలో చేరడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. మంచిని అభినందించే సంస్కారం ఆయనదన్నారు. పాదయాత్రలో కాపుల స్థితిగతులను, ఆర్ధిక పరిస్థితిని అర్థం చేసుకున్నానని గుర్తు చేశారు. సమాజంలో అనేక వెనుకబడిన వర్గాల మాదిరిగానే కాపులను ఆదుకోవాలని ఆనాడే నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయం మూలంగా కాపు వర్గం వెనుక బడిందన్నారు. పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విధంగా ఈ నాలుగున్నరేల్లలో కాపులకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామన్నారు. కాపుల హక్కుల సాధనకు, న్యాయం జరిగేలా కృషి చేశామన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 లో అధికారం చేపట్టి కాపులకు రిక్తహస్తం చూపారన్నారు, 2009 లలో వచ్చిన ప్రభుత్వాలు కాపులకు ఏమీ చేయలేదన్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీ లోకి వెళ్ళినంత శ్రద్ధగా ఆయా నాయకులు కాపులకు మేలు లేదని విమర్శించారు. ఏడాదికి వేయి కోట్లు కేటాయించి కాపుల ఉన్నతికి కృషి చేశామన్నారు. కేంద్రప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కల్పించిన రిజర్వేషన్లలో కాపులకు 5శాతం కేటాయించామన్నారు. కాపుల రిజర్వేషన్ తన పరిధిలో లేదని ప్రతిపక్ష నేత జగన్ తపించుకున్నారన్నారు. కాపులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని విమర్శించారు. సాయి సుధాకర నాయుడు తెలుగుదేశం పార్టీలో చేరాలన్న నిర్ణయం సరైనదని అభినందించారు. ఆయనతోపాటు పలువురు వైశ్యులు కూడా తెదేపాలో చేరడం శుభపరిణామన్నారు. ఒకపక్క బడ్జెట్ లోను, మరోపక్క విదేశాలలో చదువుకునే కాపు యువతకు రూ.15 లక్షల ఆర్ధిక సాయం అందిస్తున్నామని గుర్తు చేశారు. పదమూడు జిల్లాల్లోనూ ముఖ్యంగా సత్తెనపల్లి వంటి మారుమూల ప్రాంతాల్లోనూ కాపు భవన్ లకు శంకుస్థాపన చేశామన్నారు. అందరితో సమానంగా కాపులను పైకి తీసుకు వచ్చే బాధ్యతనాదన్నారు. కాపులకు నిరంతరం అండగా ఉంటానని హామీ ఇచ్చారు.సుధాకర్ నాయుడు నిర్ణయం ఇతరులకు స్పూర్తి దాయకమన్నారు. కాపు ఉద్యమంలో పెట్టిన కేసులను ఎత్తి వేయడంలో సుధాకర నాయుడుతో సంప్రదించి నిర్ణయిస్తామని హామీ ఇచ్చారు. “నేను రాసే పరీక్ష కు మీరే మార్కులు వేయాలి’’ అని ప్రజలకు పిలుపిచ్చారు. వట్టి పోయిన గేదెను విస్మరించి పాలిచ్చే గేదెను ఆదరించాలని కోరారు. ఒక్క ఓటు కూడా జగన్ కు పడకూడదని పిలుపిచ్చారు. జగన్ కు ఓటేస్తే అభివృధికి ఆటంకమన్నారు. తటస్తులు, కులసంఘాలు వ్యాపారులు అందరూ తేదేపాకు ఓటు వేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు పత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి , పలువురు గుంటూరు జిల్లా తెదేపా నాయకులు పాల్గొన్నారు.













