చంద్రబాబు అరెస్టు కక్ష సాధింపు చర్యలా ఉంది: మమతా బెనర్జీ
టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా స్పందించారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆమె.. ‘చంద్రబాబు అరెస్ట్ ఒక కక్ష సాధింపు చర్యలా ఉంది. చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు ఏమాత్రం సరికాదు. టీడీపీ హయాంలో ఏదైనా తప్పు జరిగి ఉంటే దాని గురించి మాట్లాడాలి. ఆ సమస్యపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలి. అంతేకానీ ఇలా కక్షపూరితంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు’ అని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబును సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
https://twitter.com/i/status/1701191243261481216













