సీఎం వైఎస్ జగన్ ను కలిసిన టెక్ మహీంద్ర ఎండీ
విశాఖపట్నం సహా మూడు ప్రాంతాల్లో మూడు స్టార్ హోటళ్ల నిర్మాణానికి మహీంద్ర గ్రూప్ ప్రతినిధులు సంసిద్ధతను వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను టెక్ మహీంద్ర ఎండీ, సీఈఓ సీపీ గుర్నానీ, సంస్థ ప్రతినిధులు కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రోత్సాహకాల గురించి మహీంద్ర గ్రూప్ ప్రతినిధులకు సీఎం వివరించారు. ఒక్కో హోటల్ నిర్మాణానికి రూ.250 కోట్లు వెచ్చిస్తామని, రాబోయే రెండు నెలల్లో శంకుస్థాపనలు చేస్తామని సంస్థ ప్రతినిధులు సీఎంకు తెలిపారు.













