తెలుగుదేశంలో చేరిన మహాసేన రాజేశ్
వైసీపీ ప్రభుత్వ విధానాలపై సోషల్ మీడియా వేదికగా సునిశిత విమర్శలు చేసే మహాసేన రాజేశ్ టీడీపీలో చేరారు. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో దళిత సామాజిక వర్గంతో నిర్వహించిన సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజేశ్ మాట్లాడుతూ 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబును దళిత ద్రోహిగా సీఎం జగన్ చిత్రీకరించారు. జగన్ మాటలు విని చంద్రబాబును అపార్థం చేసుకున్నాం. అయితే నిజమైన దళిత ద్రోహి ఎవరో త్వరగానే గ్రహించాం. ఎస్సీలకు చంద్రబాబు 27 సంక్షేమ పథకాలను అమలు చేస్తే, వైసీపీ ప్రభుత్వం రాగానే జగన్ వాటిని రద్దు చేశారు. 2019లో తప్పు చేయడకుండా ఉండుంటే అమరావతి నిర్మాణం పూర్తయ్యేది అన్నారు. దళితులు ఎవరి కాళ్లమీద వారు నిలబడేలా చంద్రబాబు చేశారు. చీకటి వచ్చాకే వెలుగు విలువ తెలుస్తుంది. జగన్ తుగ్లక్ పాలన చూశాక చంద్రబాబు పాలన రామరాజ్యం అని అర్థమవుతోంది అని ఆయన వ్యాఖ్యానించారు.













